ఆధార్‌ లింకు లేకున్నా పాన్‌ కార్డులు చెల్లుబాటు..

0

ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులు రద్దవుతాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆదాయపు పన్ను శాఖ ప్రకటించింది. పాన్‌ కార్డుతో ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్‌ జారీచేసింది. ఆధార్‌తో పాన్‌ కార్డు అనుసంధానానికి ఈరోజే ఆఖరి తేదీ అని ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీంతో పెద్దసంఖ్యలో ప్రజలు ఆధార్‌ అనుసంధానానికి ఇన్‌కమ్‌ట్యాక్స్‌ వెబ్‌సైట్‌ను ఆశ్రయిస్తుండటంతో ఆ సైట్‌ సర్వర్‌పై భారం పడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో ఎవరూ భయపడొద్దు. జూన్‌ 30 తర్వాత ఆధార్‌తో అనుసంధానం కాని పాన్‌ కార్డులు రద్దు కావు’ అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్‌ సుశీల్‌ చంద్ర స్పష్టంచేశారు. ఈ అంశంపై మరో నోటిఫికేషన్‌ విడుదల చేసేంత వరకూ ఆధార్‌తో అనుసంధానం లేకపోయినా పాన్‌ కార్డులు చెల్లుతాయని వెల్లడించారు