జయలలిత అకౌంటెంట్.. ఆత్మహత్య..

0

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలితకు చెందిన కొడనాడ్‌ ఎస్టేట్‌లో విధులు నిర్వర్తిస్తున్న మరో వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్టేట్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ల దినేశ్‌ కుమార్‌.. కోటగిరిలోని తన ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. కొడనాడ్‌ ఎస్టేట్‌లో వాచ్‌మెన్‌ హత్యకు గురైన రెండు నెలలకే దినేశ్‌ మృతిచెందడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే గత కొద్ది రోజులుగా దినేశ్‌ మనస్తాపానికి గురైనట్లు అతడి కుటుంబసభ్యులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే దినేశ్‌ అతడి సహోద్యోగులతో తమ భవిష్యత్తు గురించి చర్చించారని చెప్పారు. ఎస్టేట్‌ యాజమాన్యం మారితే తమకు ఉద్యోగం ఉంటుందో లేదో అన్న ఆందోళనకు గురయ్యారన్నారు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.