మరోసారి కాల్పుల విరమన ఒప్పందం ఉల్లంఘంచిన పాక్..

0

కాశ్మీర్ సరిహద్దులో మరోసారి పాక్ బలగాలు.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించాయి. పూంఛ్ సెక్టార్‌లో.. కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లను.. భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటోంది.

మరోవైపు బందీపోరా జిల్లాలో ఉగ్రవాదులు పంజా విసిరారు. ఆర్మీ జవాన్లను లక్ష్యం చేసుకుని దాడికి తెగబడ్డారు. దాడిలో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. గాయపడ్డ జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అప్రమత్తమైన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. మరోవైపు కశ్మీర్ లో హైఅలెర్ట్ ప్రకటించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ప్రధమ వర్ధంతి సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు భద్రత దళాలు భారీగా మోహరించాయి.