దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి..

0

వచ్చే ఎన్నికలు టిడిపి కి అనుకూలంగా ఉందంటున్నారని నిజంగా అలాగే ఉంటే ముందస్తు ఎన్నికలకు సిద్ధం కావాలని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్‌ విసిరారు. గత ఎన్నికల్లో ఓటమి చెందినపుడు టీడీపీని మూసెయ్యకుండా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేశారని,. అలాంటి నేతలు ఇప్పుడు కాపు ఉద్యమాన్ని మూసేయమనడం సబబేనా అని ముద్రగడ ప్రశ్నించారు. కాపు జాతికి ఇచ్చిన హామీలు మర్చిపోయారని, తమ సోదరుడు పవన్ కళ్యాణ్‌ని ఎన్నికల్లో వాడుకున్నారన్నారు. పవన్‌ చెప్పినట్లు కాపు జాతికిచ్చిన హామీలు నెరవేర్చాలని ముద్రగడ డిమాండ్‌ చేశారు. అణాకి ఆరుగురు కాపుల్ని కొన్నామని కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేయించడం ఎంతవరకు సమంజసమని ముద్రగడ ప్రశ్నించారు.