Vekuva | Discussion On Revanth Reddy to Meet Rahul Gandhi | Kaleshwaram Project

0

రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రాహుల్‌ గాంధీ సమక్షంలో ఆయన్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారు. నిన్న అనుచరులతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి వచ్చి.. రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేయాలని ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే లాభ నష్టలపై విశ్లేషన కొనసాగిస్తాం.

కాళేశ్వరం ప్రాజెక్టుకు మరో కీలక అనుమతి లభించింది. అత్యంత ముఖ్యమైన హైడ్రాలజీ క్లియరెన్స్ ను కేంద్ర జలసంఘం జారీ చేసింది. ఇటీవల ప్రాజెక్టుకు సంబంధించి అటవీ భూములకు మొదటి దశ అనుమతిలిస్తూ.. కేంద్ర అటవీ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. పాత ప్రాజెక్టు కావడం వల్ల గోదావరి నదీ యాజమాన్య బోర్డు, అపెక్స్ కమిటీ అనుమతి అవసరం లేదని కేంద్రం తెలిపింది.