మరో సంచలనానికి తెరలేపిన వర్మ.. పోర్న్‌స్టార్‌తో

0

అతనో దర్శకుడు, దర్శకత్వం అంటే స్టార్ట్ , కెమెరా,యాక్షన్ కాకుండా 24 క్రాఫ్ట్స్ పనితనాన్ని ఎవరు వేలెత్తి చూపించలేనంతగా చూపిన గ్రేట్ డైరెక్టర్. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్ధాయికి తీసుకెళ్లిన దిగ్గజం. అతడే రామ్ గోపాల్ వర్మ. ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్తానని కలరింగ్ ఇచ్చుకునే రాంగోపాల్ వర్మ….

నీతులకు, నియమాలు జానేదో యార్ లెట్స్ ఎంజాయ్ అంటూ పనికిరాని ప్రసంగాలు చెప్పే వర్మ సోషల్ మీడియా సాక్షిగా పదే పదే రెచ్చిపోతూనే ఉన్నాడు. ఫేస్ బుక్, ట్విట్టర్, యూ ట్యూబ్ లకు యూత్ అతుక్కుపోతున్న కాలంలో వారిని టార్గెట్ చేసుకుని బూతు సినిమాలు తీసేందుకు తెగ ఆసక్తి కనబరుస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే వర్మ రి లీజ్ చేసిన గన్స్ అండ్ థైస్ ఎంతటి హాట్ టా పిక్ గా నిలిచిందో తెలిసిందే. ఏ స్ధాయిలో మహిళా సంఘాల ఆగ్రహాన్ని చవి చూసిందో ఇంకా మర్చిపోలేనిదే……

గన్స్ అండ్ థైస్ ట్రైలర్ రేపిన దుమారం ఆగిపోకముందే మేరీ బేటీ సన్ని లియోన్ బన్ నా చాహతీ హై అంటూ బ్లూ ఫిల్మ్ హీరోయిన్ గా మారాలనుకునే ఓ యువతి కధను షార్ట్ ఫిల్మ్ గా తెరకెక్కించాడు. దీన్ని యూట్యూబ్ లో అప్ లోడ్ చేసి నట్టింట్లో సెగలు పుట్టించాడు. చదువుకుని , ఉద్యోగం సంపాదించుకుని హాయిగా సెటిల్ అవ్వాలనుకునే అమ్మాయిల్లో పోర్న్ గురించి లేనిపోనివి జొప్పిస్తున్నారని మహిళాలోకం మండిపడింది.

నాలుగుగోడల మధ్య, రహస్యంగా, ఏకాంతంలో జరగాల్సిన సెక్స్ గురించి మాట్లాడి చీప్ పబ్లిసిటీ కోరుకునే వర్మ మరోసారి తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నాడు. ఫేస్ బుక్ లో తన అఫీషీయల్ పేజ్ నుంచి ఓ పోస్టర్ షేర్ చేసాడు.హాలీవుడ్ యాక్టర్ మీయా మాల్కోవా న గ్నంగా కూర్చుని ఉంటే ఆమె ముందు సిట్టింగ్ ఫోజ్ లో ఉండే వర్మ డైరెక్షన్ చేస్తున్నట్లు ఫోజ్ పెట్టాడు. ఇంతే కాక ఈ సృష్టిలో దేవుడు, సెక్స్, నిజం అనేవి సబ్జెక్ట్ మ్యాటర్స్…. ఇవి నన్ను ఎప్పుడు ఉత్తేజ పరుస్తుంటాయి అంటూ కామెంట్ కూడా పెట్టాడు.

వర్మను గుడ్డిగా అనుసరించే వారంతా అహా, ఓహో అంటూ వర్మను ఆకాశానికెత్తేస్తుంటే , మహిళా సంఘాలు మాత్రం దుమ్మెత్తి పోస్తున్నాయి. వర్మలాంటి పర్వర్టెడ్ ఇడియట్స్ ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎప్పటిలానే ఇవేమీ పట్టించుకోని రామ్ గోపాల్ వర్మ మరో పోస్టర్ రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here