తనపై ఉన్న కేసులు వెనక్కి తీసుకోవాలంటున్న శ్రీనివాస్ రెడ్డి

0

ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ప్రసక్తే లేదంటున్న సంగీత

మొత్తానికి 54 రోజుల తర్వాత సంగీత మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని అత్తారింట్లోకి చేరుకుంది.. మహిళా సంఘాలు.. బంధువుల సమక్షంలో ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించింది.. కూతురుతో కలిసి ఇల్లంతా కలియతిరిగింది సంగీత.. మరోవైపు.. సంగీత కేసులో మియాపూర్ కోర్ట్…. ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది…. సంగీతకు నెలకు 20 వేల రూపాయలు మెయింటెనెన్సు ఖర్చు ఇవ్వాలని ఆదేశించింది.

శ్రీనివాస్ రెడ్డి వేసిన కౌంటర్ పిటిషన్ను డిస్మిస్ చేసింది కోర్టు. సంగీత అదే ఇంట్లో ఉండేలా శ్రీనివాస్ రెడ్డి చూసుకోవాలని తెలిపింది.. సంగీత.. ఆమె కూతురుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీనివాస్ రెడ్డి చూసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అత్తా.. మామ…అదే ఇంట్లో ఉండేలా చూడాలని పేర్కొంది. సంగీత దినచర్యలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని మియాపూర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే తనపై ఉన్న కేసులు అన్ని ఉపసంహరించుకుంటే అప్పుడే అన్ని విధాలా సంగీతను బాగా చూసుకుంటానని శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నాడు. అయితే తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో కేసులు విత్ డ్రా చేసుకునే ప్రసక్తే లేదని సంగీత తేల్చి చెబుతోంది. దీంతో కథ మళ్ళీ మొదటికి వచ్చినట్టయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here