మరో వారం పాటు వాయిదా పడిన పోలవరం టెండర్లు..

0

గడువు పొడిగించాలని ప్రభుత్వానికి ప్రాజెక్టు అథారిటి సూచన

పోలవరం ప్రాజెక్టులో శుక్రవారం తెరవాల్సిన కొత్త టెండర్లు మరో వారంపాటు వాయిదా పడ్డాయి. ఈ నెల 18 తేదీ వరకూ టెండర్ల గడువును పొడిగించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రభుత్వానికి సూచించింది. ఈ నెల 16 తేదీన మరోమారు భేటీ కానున్న పీపీఏ టెండర్లపై వివిధ అంశాలను పరిశీలించాలని నిర్ణయించింది. ప్రాథమికంగా టెండర్ల విషయంలో ముందుకు వెళ్లాలని ప్రభుత్వానికి సూచించిన పోలవరం అథారిటీ.. మరో మారు దీనిపై చర్చించి ఆ తర్వాత ముందుకు వెళ్లాలని భావిస్తోంది.

60 సి నిబంధన కింద కొన్ని పనులు విడదీసి 1395 కోట్ల పనులకు ప్రభుత్వం టెండర్లు పిలిచింది. స్పిల్ వే లోని కాంక్రీటు పనులు, స్పిల్ , పైలట్ ఛానళ్ల నిర్మాణం తదితర అంశాలను ప్రధాన కాంట్రాక్టరు నుంచి తప్పించి కొత్త వారికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టెండర్లు తెరిచేందుకు ఈ నెల 12 తేదీతో గడువు ముగుస్తుండటంతో పీపీఏ నిర్ణయం మేరకు ఈ అంశం 18 తేదీకి వాయిదా పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here