సంక్రాంతికి కరెన్సీ కష్టాలు..

0

జిల్లాల్లో పని చేయని ఏటీఎంలు.. ఇబ్బందుల్లో వినియోగదారులు

సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన ప్రజలు నగదు కోసం తిప్పలు పడాల్సి వస్తోంది. నోట్ల రద్దు తర్వాత సంవత్సరంపాటు కొనసాగిన కష్టాలు ఈ ఏడాది సంక్రాంతి పండుగకు సైతం అదే పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఏటీఎంలు పని చేయకపోవడంతో నగదు కొరత తీవ్రంగా ఏర్పడుతోంది. ప్రతి రోజు ఏటీఎం వద్దకు వెళ్తున్న వినియోగదారులు నో క్యాష్‌ బోర్డు చూసి వెనుదిరుగుతున్నారు. పలు జిల్లాల్లో సుమారు 50 వరకు ఏటీఎంలు ఉండగా 20 మాత్రమే పని చేస్తున్నాయి. వాటిలో కూడా ఉదయం లేదా సాయంత్రం వేళల్లో మాత్రమే నగదు ఉండడంతో వినియోగదారులు బారులు తీరుతున్నారు. నగదు కొరతపై అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here