Welcome to Studio N

Loading...

హైదరాబాద్: త్వరలో ధర్మాన, గీతారెడ్డి, పొన్నాలను విచారించనున్న సీబీఐ, జగన్ ఆస్తుల కేసులో ప్రకంపనలు సృష్టిస్తున్న సీబీఐ, వాన్ పిక్ భూ కేటాయింపుపై సీబీఐ ముందు హాజరుకానున్న మోపిదేవి, ఇప్పటికే మోపిదేవిని ఒకసారి విచారించిన సీబీఐ, మోపిదేవిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయవచ్చని ఊహాగానాలు.

ప్రకాశం: ఒంగోలులో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అరెస్టు, తమ్ముడు డేవిడ్ రాజు హత్య కేసులో కేఏ పాల్ తో సహా మరో ఇద్దరు నిందితులు అరెస్టు, రిమ్స్ లో కేఏ పాల్ కు వైద్య పరీక్షలు చేయించిన పోలీసులు, కేఏ పాల్ ని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన పోలీసులు, 2010 ఫిబ్రవరిలో డేవిడ్ రాజు హత్య, మహబూబ్ నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లిలో ఘటన, అరెస్ట్ చేయవద్దంటూ పోలీసులకు రూ. 3 కోట్లు ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్, పాల్, డేవిడ్ ల మధ్య ఆస్తి తగాదాలు.

ఖమ్మం: జిల్లాలోని మధిరలోని శ్రీవల్లభ కోల్డ్ స్టోరేజ్ లో అగ్నిప్రమాదం, నిన్నటి నుంచి అదుపులోకి రాణి మంటలు, 36 గంటలుగా మంటలార్పుతున్న ఫైరింజన్లు, భారీగా ఎగసిపడుతున్న మంటలు, ప్రమాదవశాత్తు ఫైరింజన్ డ్రైవర్ మృతి, కోల్డ్ స్టోరేజీ రికార్డులను స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశం.

కృష్ణా: గన్నవరం పీఎస్ లో ఉరివేసుకుని కానిస్టేబుల్ సంజీవ్ ఆత్మహత్య.

వరంగల్: అకారణంగా అదుపులోకి తీసుకున్న తెలంగాణవాదులు, టీఆర్ఎస్ కార్యకర్తలు, విద్యార్ధులను విడుదల చేయాలంటూ ఎస్పీ ఆఫీస్ ఎదుట టీఆర్ఎస్ ధర్నా, రోడ్డుపై బైఠాయింపు, పరిస్ధితి ఉద్రిక్తం.

హైదరాబాద్: చంద్రబాబు నివాసంలో సీనియర్ల భేటీ, ఉపఎన్నికలు, బస్సు యాత్రపై చర్చ.

హైదరాబాద్: ఆర్మియాక్ట్ కేసులో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు, పలు ఆయుధాలు స్వాధీనం.

వరంగల్: వరంగల్ లో ఉద్రిక్తత, సీఎం టూర్ నేపధ్యంలో ముందస్తుగా 300 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్టు, అరెస్టులపై టీఆర్ఎస్ నేతలు ఆగ్రహం, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ఆందోళనకు దిగుతున్న టీఆర్ఎస్ నేతలు.

హైదరాబాద్: నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను మూడోరోజు కస్టడీలోకి తీసుకున్న సీబీఐ అధికారులు, చంచల్ గూడ జైలు నుంచి దిల్ కుషా గెస్ట్ హౌస్ కు తరలింపు దిల్ కుషా గెస్ట్ హౌస్ లో నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను విచారిస్తున్న సీబీఐ అధికారులు.

హైదరాబాద్: సైదాబాద్ సింగరేణి కాలనీలో పేలిన సిలిండర్, ఒకరు మృతి, ముగ్గురి పరిస్ధితి విషమం, ఆస్పత్రికి తరలింపు.

ఖమ్మం: మధిరలోని శ్రీలక్ష్మి వల్లభ శీతల గిడ్డంగిలో అగ్నిప్రమాదం, భారీగా ఎగిసిపడుతున్న మంటలు, మంతలార్పెందుకు వెళ్లిన ఫైర్ సిబ్బందిలో ఒకరు మృతి, మరో ఇద్దరు శిధిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం, ప్రమాదంలో ఒక అగ్నిమాపక యంత్రం దగ్ధం.

హైదరాబాద్: ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా వైఎస్ఆర్ పార్టీ నేత, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్, ప్రచారానికి జగన్ ఆహ్వానించలేదని జూపూడి దూరం, జిల్లా ఇన్ చార్జి బాధ్యతలు ఇవ్వలేదని జూపూడి అలక.

హైదరాబాద్: ఓఎంసీ కేసులో నిందితుడు రాజగోపాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ ఈ నెల 21కి వాయిద.

హైదరాబాద్: పది మంది ఐపీఎస్ అధికారుల బదిలీ, హైదరాబాద్ పోలీసు కమిషనర్ గా అనురాగ్ శర్మ, ఆర్టీసీ ఎండీగా ఏకే ఖాన్ బదిలీ, శాంతిభద్రతల డీజీగా హెచ్ జే హుడా, జైళ్ల శాఖ సీపీగా డీజీ దాస్, పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా అరుణా బహుగుణా, ఎస్పీఎస్ చీఫ్ గా లోకేంద్ర శర్మ, ఆర్టీసీ ఎండీ ప్రసాదరావు ఏసీబీ డీజీగా బదిలీ, ఏపీ పోలిస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా మదన్ లాల్, గ్రే హౌండ్స్ అదనపు డీజీగా జేవీ రాముడు, ఏపీఎస్పీ అదనపు డీజీగా గౌతం సవాంగ్.

కృష్ణా: ఉప్పలూరు-తెన్నేరు మధ్య ట్రాక్టర్ ను ఢీకొట్టిన విశాఖ-లోకమాన్య తిలక్ టెర్మినస్ ఎక్స్ ప్రెస్, పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం.

Example Frame